Free Cylinder Scheme | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు కూటమి ప్రభుత్వం (AP Government) ఓ గుడ్ న్యూస్ తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత సిలిండర్ (Free Gas Cylinder) పథకానికి శ్రీకారం చుట్టింది.
దీపావళి (Deepawali) నుంచే ఫ్రీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసిం ది ఏపీ సర్కార్. ఈ మేరకు మంగళవారం నుం చే గ్యాస్ బుకింగ్ సేవలను ప్రారంభించింది.
ఈ పథకంలో భాగంగా అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ 1, 2015 నుం చి జూలై వరకు మరొకటి, జూలై 1 నుం చి నవం బర్ వరకు దశల వారీగా మొత్తం మూడు సిలిండర్లను ఉచితం గా ఇవ్వనున్నారు.
మంగళవారం గ్యా స్ బుక్ చేసుకుంటే దీపావళి (Diwali) రోజున డెలివరీ చేయనున్నారు. కాగా, సిలిం డర్ కోసం గ్యా స్ ఏజెన్సీ (Gas Agency)కి వినియోగదారులు ముం దుగా ఆ మొత్తం చెల్లిం చాలి. అయితే, కట్టిన డబ్బు రెం డు రోజుల్లో మళ్లీ వారి బ్యాం క్ అకౌం ట్ల (Bank Accounts)లో జమ కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు (White Ration Cards) ఉన్న వారు ఈ ఉచిత సిలిం డర్ పథకానికి (Free Cylinder Scheme) దరఖాస్తు చేసుకొవచ్చు . బుకిం గ్‌లో ఎలాం టి అవాం తరాలు ఎదురైనా.. వెంటనే టోల్ ఫ్రీ నెం బర్ (Toll Free Number) 1967కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.