Lodha Group | భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో దాతృత్వానికి పెట్టింది పేరు టాటా గ్రూప్ (TATA Group). ఉపాధి కల్పనతోపాటు సామాజిక కార్యక్రమాల్లో టాటా గ్రూప్ ఎప్పుడూ ముందుంటుంది.
తాజాగా ఆ టాటా గ్రూప్ సేవ గుణాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరో దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. భారతదేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన మాక్రోటెక్ డెవలపర్ (Macrotech Developers) యాజమాన్యం అయిన లోధా కుటుంబం పెద్ద ఎత్తున సామాజక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
తమ కుటుంబ వాటాలో గణనీయమైన భాగాన్ని లోధా ఫిలాంత్రోపీ ఫౌండేషన్ (LPF)కి బదిలీ చేయనున్నట్లు తెలిపింది. ఎల్‌పిఎఫ్‌కు లోధా గ్రూప్ రూ. 20,000 కోట్ల విలువైన షేర్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా లోధా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ లోధా మాట్లాడుతూ, “వందేళ్ల కిందట టాటా కుటుంబం తమ సంస్థలో తమ వాటాలో ఎక్కువ భాగాన్ని టాటా ట్రస్ట్ లకు అందించింది.
టాటా ట్రస్ట్‌లు చేసిన మంచి పని నాకు ప్రధాన ప్రేరణగా నిలిచాయి. నా కుటుంబ సభ్యుల మద్దతులో లోధా ఫిలాంత్రోపిక్ ఫౌండేషన్ (LPF) ఇప్పుడు భారతదేశంలోని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తోంది అని తెలిపారు. ఈ రూ.20,000 కోట్ల విలువైన షేర్లపై వచ్చే డివిడెండు ఆదాయాన్ని విద్య, మహిళా సాధికారత కార్యక్రమాలపై వెచ్చించనున్నట్లు తెలిపారు.