Saturday 13th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బెంగాల్ పోలింగ్: బీజేపీ గుర్తు కనిపించకుండా వైట్ టేపులు!

బెంగాల్ పోలింగ్: బీజేపీ గుర్తు కనిపించకుండా వైట్ టేపులు!

EVM Tampering In Bengal Polls | పశ్చిమ బెంగాల్ (West Bengal Elections) అసెంబ్లీ రెండో దశ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని పలు బూత్‌లలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం (EC) అప్రమత్తమైంది.

ఫాల్టా అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బూత్ నంబర్ 144, 189లలో బీజేపీ గుర్తు (కమలం) కనిపించకుండా వైట్ టేపులు అంటించారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వీయా వీడియో సాక్ష్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దీనివల్ల ఓటర్లు తమ గుర్తును ఎంచుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) మనోజ్ అగర్వాల్ స్పందించారు.

ఈవీఎంలపై టేపులు లేదా ఇంక్ మార్కులు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు మరియు అబ్జర్వర్ల నుండి నివేదికలు వచ్చిన తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఒకవేళ ఒక నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బూత్‌ల నుండి ఇలాంటి ఫిర్యాదులు వస్తే, కేవలం ఆ బూత్‌లకే కాకుండా మొత్తం నియోజకవర్గానికే రీపోలింగ్ పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని సీఈఓ తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions