Wednesday 29th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > Exit Polls 2026: 5 రాష్ట్రాల ఓటరు తీర్పు ఎవరికి అనుకూలం?

Exit Polls 2026: 5 రాష్ట్రాల ఓటరు తీర్పు ఎవరికి అనుకూలం?

exit polls 2026

Exit Polls 2026 | పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం పీఠం నిలబెట్టుకోగా, మరికొన్ని చోట్ల మార్పు కనిపిస్తోంది.

దేశం మొత్తం ఆసక్తి కనబరుస్తున్న పశ్చిమ బెంగాల్ లో ఉత్కంఠభరిత పోరుపై సర్వే సంస్థలు భిన్నమైన అంచనాలు వెలువరించాయి. మ్యాట్రిజ్  బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కుతుందని అంచనా వేసింది.

పీపుల్స్ పల్స్ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. సీ-ఓటర్ మాత్రం టీఎంసీ 44%, బీజేపీ 40% ఓట్ల షేర్ తో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది.

తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అయితే, మొదటిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ ‘టీవీకే (TVK)’ ఎవరి ఓట్లను చీలుస్తుందనే అంశం ఫలితాలపై ప్రభావం చూపవచ్చు.

కేరళలో ఈసారి మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. యూడీఎఫ్ (UDF) కూటమి 40% ఓట్లతో ముందంజలో ఉండే అవకాశం ఉందని, అధికార ఎల్డీఎఫ్ (LDF) 36% ఓట్లకు పరిమితం కావచ్చని సీ-ఓటర్ అంచనా వేసింది.

అస్సాంలో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని సర్వేలు బలంగా చెబుతున్నాయి.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే (NDA) కూటమి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే. మే 4వ తేదీన వెలువడే అధికారిక ఫలితాల్లో అసలైన విజేత ఎవరన్నది తేలుతుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions