Wednesday 29th April 2026
12:07:03 PM
Home > తాజా > నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా మే 1 నుండి భారీ జాబ్ మేళాలు!

నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా మే 1 నుండి భారీ జాబ్ మేళాలు!

job mela

MegaJob Melas In Tతెలంగాణ రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) మరియు క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీ జాబ్ మేళాలను నిర్వహించనున్నారు.

జిల్లాల వారీగా జాబ్ మేళా షెడ్యూల్ (మే 2026):

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 1 నుండి మే 12 వరకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి

మే 1: మహబూబ్ నగర్
మే 2: నల్గొండ
మే 4: ఖమ్మం
మే 5: కరీంనగర్
మే 6: పెద్దపల్లి, ఆదిలాబాద్
మే 7: నిజామాబాద్
మే 8: సంగారెడ్డి, వరంగల్
మే 11: రంగారెడ్డి
మే 12: హైదరాబాద్ (మెగా జాబ్ మేళా)

ఈ జాబ్ మేళాలో సుమారు 250కి పైగా ప్రైవేట్ కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఈ మేళాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక లక్ష మంది యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జాబ్ మేళాలో కేబీకే గ్రూప్ నియామకాలు..

టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ ఫెయిర్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ మరియు డిజిటల్ మార్కెటింగ్ సంస్థలైన కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ మరియు యూనిప్రో సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.

అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్ నకు చెందిన ఈ కంపెనీలు సాఫ్ట్‌ వేర్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఇతర కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా చేపడతున్న ఈ జాబ్ మేళాల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు “PrajaPalana Pragathi Pranalika: Youth & Sports” మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీప TASK కేంద్రాన్ని లేదా జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions