Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ట్రంప్ తనయుడితో రాంచరణ్

ట్రంప్ తనయుడితో రాంచరణ్

Ram Charan spotted chatting with Donald Trump Jr | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ తో గ్లోబల్ స్టార్ రాంచరణ్ కలిసి దిగిన ఫోటోల్ వైరల్ గా మారాయి. రాజస్థాన్ ఉదయపూర్ లో అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వ్యాపారవేత్త, ఫార్మా టైకూన్ రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన-వంశీ గాదిరాజుల వివాహం అట్టహాసంగా జరిగింది.

మూడు రోజుల పాటు సాగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ అంతర్జాతీయ, జాతీయ వార్తల్లో నిలిచింది. ఈ వివాహ వేడుక కోసం హాలీవుడ్ సెలబ్రెటీల, బాలీవుడ్, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. అలాగే రాంచరన్ సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో ట్రంప్ జూనియర్ తో రాంచరణ్ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ వరల్డ్ వైడ్ ఫేమ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions