Saturday 6th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘మేం గొర్రెలం కాదు’.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్!

‘మేం గొర్రెలం కాదు’.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్!

Prakash Raj Counter To Nagababu | జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ఒక పోస్ట్‌ కు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ఘాటుగా బదులివ్వడం ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నాగబాబు పోస్ట్ ఏంటి..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనమని.. ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని కోరుతూ నాగబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. నాయకుడి నిర్ణయాలపై నమ్మకం ఉంచాలనే అర్థం వచ్చేలా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నించడం మా హక్కు..
ప్రకాష్ రాజ్ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. “సందేహాలు పెట్టుకోకుండా, నిశ్శబ్దంగా, ఎలాంటి అనుమానాలు లేకుండా నాయకుణ్ణి అనుసరించడానికి మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ప్రశ్నించడం మా హక్కు” అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

ఏ నాయకుడైనా.. లేదా నేనే లీడర్‌ని అనుకున్నవాడైనా సరే, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన కనీస బాధ్యత ఆ నాయకుడిపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కౌంటర్ ముగింపులో “అర్థం అయిందా?” అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్‌గా మారింది.

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలు, వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ నిరంతరం స్పందిస్తున్న నేపథ్యంలో.. తాజాగా నాగబాబుకు ఇచ్చిన ఈ కౌంటర్ నెట్టింట వైరల్ అవుతోంది.

You may also like
YS Sharmila vs Jagan Mohan Reddy 2026, Sharmila on Jagan tweets today, Women's Reservation Bill AP politics, Jagan supporting Delimitation Bill, వైఎస్ షర్మిల జగన్ విమర్శలు, ఏపీ రాజకీయ వార్తలు, మహిళా బిల్లు జగన్ ట్వీట్.
‘దత్తపుత్రుడు అసలు రంగు బయటపడింది’.. జగన్ పై వైఎస్ షర్మిల నిప్పులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions