Saturday 2nd December 2023
12:07:03 PM
Home > సినిమా > దేవరలో అల్లు అర్హ.. రెమ్యునరేషన్ పై టాలీవుడ్ లో రూమర్లు!

దేవరలో అల్లు అర్హ.. రెమ్యునరేషన్ పై టాలీవుడ్ లో రూమర్లు!

allu arha in devara

Allu Arha In Devara | RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న తాజా చిత్రం దేవర (Devara).

కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు.

ప్రకాష్ రాజ్, మేకా శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్రా రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే నెలలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ బాకు పట్టుకుని సముద్రం ఒడ్డున ఉన్న ఎత్తైన రాళ్లపై నిలబడి ఉన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు గతంలోనే ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. దేవర తారాగణం జాబితాలోకి తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కుమార్తె బేబీ అర్హ (Baby Arha) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.

Read Also: రియల్ హీరోయిన్ అంజు యాదవ్…రీల్ హీరో పవన్ కళ్యాణ్…!

దేవరలో అర్హ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్ర కోసం అర్హను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 10 నిమిషాల నిడివి పాత్రలో అర్హ నటించనునట్లు సమాచారం.

అయితే ఈ పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్ కూడా చెల్లిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దేవర చిత్రం కోసం అర్హకు రూ. 20 లక్షలు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

కానీ ఈ వార్తల్లో నిజమెంతో స్పష్టంగా తెలీదు. అర్హ ఎంపికపై సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Designed & Developed By KBK Business Solutions