Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > రియల్ హీరోయిన్ అంజు యాదవ్…రీల్ హీరో పవన్ కళ్యాణ్…!

రియల్ హీరోయిన్ అంజు యాదవ్…రీల్ హీరో పవన్ కళ్యాణ్…!

Rgv sensational comments on pawan kalyan

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్(Anni yadav) జనసేన నేత కొట్టే సాయి పై చేయిచేసుకున్న వివాదం చుట్టూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి.

జనసేన(janasena) నేత సాయి పైన అంజు యాదవ్ చేయిచేసుకోవడం పట్ల జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది.

ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) రంగంలోకి దిగి సీఐ పైన ఈరోజు తిరుపతిలో జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పిర్యాదు చేశారు.

తాజాగా ఈ వివాదం పై సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (ram gopal varma) స్పందించారు.

నిత్యం వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ సీఐ అంజు యాదవ్ వివాదం పై స్పందించారు.

“హేయ్ పవన్ కళ్యాణ్ చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా , అని సింహం లా గాండ్రించిన తర్వాత ఇలా దీనంగా చేతులు కట్టుకుని SP గారు అంటూ మాట్లాడటం హీరో నుంచి జీరో అయినట్టుంది.. యాజ్ ఏ ఫ్యాన్(as a fan) , ఐ హర్టెడ్(i hurted)” అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.

“డెమోక్రసీ(Democracy) లో విప్లవ పోరాటం పని చెయ్యదని తనకు తాను నిరూపించుకున్న PK గారికి శత కోటిన్నర,76 వేల, 34 వందల నమస్కారాలు” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

దీన్ని బట్టి రియల్ హీరోయిన్(heroine) అంజు యాదవ్, పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో(reel hero) అని అర్థం అవుతుందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసి మరో వివాదానికి తెర లేపారు.

కాగా ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై ‘వ్యూహం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

You may also like
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి గాయాలు!
harihara veera mallu
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. !
pawan and vh
ఏపీ డిప్యూటీ సీఎంతో కాంగ్రెస్ సీనియర్ నేత భేటీ!
modi pawan
హిమాలయాలకు వెళ్తున్నారా పవన్: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions