Virat Kohli funny interview with Mr Nags | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు సంబంధించిన ఒక ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్సీబీ ప్రమోషనల్ కంటెంట్‌లో భాగంగా మిస్టర్ నాగ్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీని అడిగిన ఒక ప్రశ్న నెటిజన్లను నవ్విస్తోంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ ఆర్సీబీ మాత్రం ఐదుగురు విదేశీ ప్లేయర్లతో ఆడుతోందని మిస్టర్ నాగ్ చమత్కరించారు.
Read Also: ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దా ‘సైలెంట్’ కౌంటర్!
ఈ మాట వినగానే కోహ్లీ ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. దీని గురించి తనకు తెలియదని, ఆ విదేశీ ఆటగాళ్లనే అడగాలని, “నేను విదేశీ ప్లేయర్‌ను అయితే కాదు కదా” అంటూ కోహ్లీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
నిజానికి విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే మిస్టర్ నాగ్ అత్యంత తెలివిగా కోహ్లీపై ఈ సెటైర్ వేశారు.
Also Read: చిరంజీవి ఇంట్లో పూజా మందిరం.. అద్భుతమైన వీడియో!
ఈ సరదా సంభాషణ ఆర్సీబీ అభిమానులను అలరిస్తోంది. ఇక ఆట విషయానికి వస్తే, ఐపీఎల్-2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, టోర్నీలో శుభారంభం చేసింది. ఈ విజయంతో గతేడాది ఫామ్ ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తామని బెంగళూరు జట్టు ధీమా వ్యక్తం చేస్తోంది.









