Sunday 23rd August 2026
12:07:03 PM
Home > క్రీడలు > మెస్సీపై కేరళం మంత్రి సంచలన ఆరోపణలు!

మెస్సీపై కేరళం మంత్రి సంచలన ఆరోపణలు!

allegations on messi by keralam sport minister

– “రూ. 250 కోట్లు తీసుకుని మోసం చేశారు”

  • కోర్టుకు వెళ్తామని హెచ్చరిక!

Keralam Minister alleges Messi fraud | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరియు ఆ దేశ జాతీయ జట్టుపై కేరళం క్రీడాశాఖ మంత్రి అబ్దురహిమాన్ విస్తుపోయే ఆరోపణలు చేశారు.

స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుని, భారీ మొత్తంలో నిధులు తీసుకున్న తర్వాత కేరళం పర్యటనను రద్దు చేసుకోవడం ద్వారా ఆ జట్టు రాష్ట్రాన్ని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.

మలప్పురంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఈ వ్యవహారంపై అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA)పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గతేడాది నవంబర్‌లో మంత్రి అబ్దురహిమాన్ స్వయంగా ప్రకటిస్తూ.. ప్రపంచకప్ విజేత అర్జెంటీనా జట్టు మార్చి నెలలో కొచ్చిలో మ్యాచ్ ఆడుతుందని తెలిపారు.

దీని కోసం స్పాన్సర్ల ద్వారా సుమారు రూ. 250 కోట్లు సమీకరించామని, ఒప్పందం ప్రకారం నిధులు అందినప్పటికీ మెస్సీ బృందం కేరళకు రాలేదని ఆయన ఆరోపించారు.

“రూ. 250 కోట్లు సేకరించడం సామాన్యమైన విషయం కాదు, అంత డబ్బు తీసుకున్న తర్వాత కూడా హామీ ఇచ్చి రాకపోవడం ఊహించని పరిణామం” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

అర్జెంటీనా జట్టు ఇతర దేశాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించినట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటన కేరళలోని లక్షలాది మంది ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గతేడాది డిసెంబర్‌లో మెస్సీ భారత్ పర్యటనకు వచ్చినప్పటికీ, కేరళంకు మాత్రం రాకపోవడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో, జరిగిన ఆర్థిక నష్టానికి మరియు నమ్మకద్రోహానికి పరిహారం కోరుతూ అంతర్జాతీయ స్థాయిలో కేసు వేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, మంత్రి చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ గానీ, మెస్సీ ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

You may also like
అర నిమిషంలో 195ముద్దులు.. గిన్నిస్ బుక్‌లోకెక్కిన లవర్స్!
ఇండోనేషియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం!
ఫ్యాక్ట్ చెక్: భారత్-పాక్ మహిళా క్రికెటర్లు మైదానంలో గొడవ పడ్డారా?
స్లోవేకియాలో మోదీ.. ‘బ్రెడ్ & సాల్ట్’ సంప్రదాయంతో ఘన స్వాగతం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions