Saturday 14th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Kumbha mela monalisa

Monalisa On Love Marriage | యూపీలోని ప్రయాగరాజ్ (Prayagraj)లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా పూసలు అమ్ముకునే మోనాలిసా (Monalisa) ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

అప్పట్లో మొనాలిసా సోషల్ మీడియాలోనే కాకుండా ప్రాంతీయ, జాతీయ మీడియా కథనాలతో వైరల్ గా మారింది. తాజగా మళ్లీ ఆమె వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి మతాంతర వివాహం చేసుకోవడంతో మొనాలిసా పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్, మొనాలిసా బుధవారం కేరళ లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఓ మలయాళ సినిమాలో కలిసి నటించనున్నారు. సుమారు ఆరు నెలల క్రితం వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.

అయితే మొనాలిసా ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకోవడంతో లవ్ జిహాద్ అనే ప్రచారం జరుగుతుంది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా లవ్ జిహాద్ ప్రచారంపై తాజగా మొనాలిసా స్పందించారు.

కేరళలో ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..ఇందులో లవ్ జిహాద్ ఏమీ లేదని పూర్తిగా ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని అన్నారు. తానే ఫర్మాన్ ను పెళ్లి కోసం మొదట ప్రతిపాదించినట్లు చెప్పారు.

అత్త కుమారుడితో తనకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నారని, కానీ అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions