Friday 18th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నోబెల్ ప్రకటన..ట్రంప్ కోసం ఆఖరి నిమిషంలో రష్యా ఏం చేసిందంటే!

నోబెల్ ప్రకటన..ట్రంప్ కోసం ఆఖరి నిమిషంలో రష్యా ఏం చేసిందంటే!

Russia Supports Trump’s Candidature For Nobel Peace Prize Hours Before Announcement | ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనుజువెల దేశ ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడోకు దక్కిన విషయం తెల్సిందే. వెనుజువెలలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం కోసం శాంతి మార్గాన ఆమె చేసిన పోరాటానికి ఫలితంగా ఈ బహుమతి దక్కింది.

మరోవైపు ఈ బహుమతిపై డోనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపిన ఘనత తనదని తనకే ఈ బహుమతి దక్కాలని పట్టుబట్టాడు. ఇదే సమయంలో నోబెల్ బహుమతి కోసం వైట్ హౌస్ అధికారులు లాబీయింగ్ సైతం జరిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచలనంగా మారింది. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన కంటే గంటల ముందు రష్యా ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపింది.

రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి యూరి ఉషకోవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఆ మేరకు కొన్ని అడుగులు కూడా పడినా ఫలితం లేకుండా పోయింది. అయితే ట్రంప్ ప్రయత్నాలను పలు సందర్భాల్లో రష్యా సైతం అభినందించింది. అలాగే ఇజ్రాయిల్ దేశం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది.

ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు ఈ మేరకు నోబెల్ నామినేషన్ పత్రాన్ని ట్రంప్ కు గతంలోనే అందజేశారు. అమెరికా ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమ మీద ఉండాలని దాయాధి పాకిస్థాన్ దేశం నోబెల్ బహుమతికి నామినేషన్ పంపారు. ఇన్ని దేశాలు మద్దతు ఇచ్చినా మరెన్నో ప్రయత్నాలు చేసినా ట్రంప్ కు నిరాశే ఎదురైంది. మరి దీనిపై ఆయన భవిష్యత్ లో ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions