Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అఫ్గాన్ తో దోస్తీ..20 అంబులెన్సులు అందించనున్న భారత్

అఫ్గాన్ తో దోస్తీ..20 అంబులెన్సులు అందించనున్న భారత్

India gifts 20 ambulances to Afghanistan as a gesture of goodwill | భారత్-అఫ్గానిస్థాన్ దోస్తీ మరింత బలపడనుంది. ఈ మేరకు భారత్ పర్యటనలో ఉన్న అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ తో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా అఫ్గాన్ ప్రజల ఆరోగ్య భద్రత కోసం 20 అంబులెన్సులను ఇవ్వనున్నట్లు జైశంకర్ ప్రకటించారు. ఈ మేరకు స్వయంగా ఐదు అంబులెన్సులను కేంద్రమంత్రి అఫ్గాన్ మంత్రి ముత్తాఖీకి అందజేశారు. అఫ్గాన్ ప్రజల ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సహాయపడతాయని తెలిపారు. MRI, CT స్కాన్ మెషీన్లు, టీకాలు, క్యాన్సర్ మందులు భారత ప్రభుత్వం అందించనున్నది.

ఈ క్రమంలో ఆయన భారత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అఫ్గాన్ మంత్రి ముత్తాఖీ. అలాగే వాణిజ్యం, మానవతా సహాయం కోసం అఫ్గాన్ రాజధాని కాబూల్ నిర్వహిస్తున్న టెక్నికల్ మెషీన్ ను పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా మార్చనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions