Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘చిన్న ఆశలు వద్దు..నేలపై కూర్చొని విద్యార్ధులతో కలెక్టర్ చర్చ’

‘చిన్న ఆశలు వద్దు..నేలపై కూర్చొని విద్యార్ధులతో కలెక్టర్ చర్చ’

Khammam Collector News | ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ( Muzammil Khan ) విద్యార్థులతో నేలపై కూర్చొని పరస్పర చర్చలు జరిపారు. విద్యార్థుల ఆకాంక్షలు, సవాళ్లను ఆసక్తిగా విని వారిని ప్రోత్సహించారు.

“విద్యా అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి” అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శతాబ్ది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజీని తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్పారు. ఇంటర్‌నెట్ ఆధారిత ఐఐటీ ( IIT ), జేఈఈ ( JEE ) కోచింగ్‌ను సమీక్షించారు.

విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని, విజయాన్ని సాధించిన తర్వాత ఇతరులకు తోడ్పడాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రోత్సహించారు.

చిన్న చిన్న ఆశలు, లక్ష్యాలు పెట్టుకోవద్దని, పెద్ద లక్ష్యాలనే ఛేదించాలన్నారు. మనల్ని నిరుత్సాహ పరిచే వారికి దూరంగా ఉండాలన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions