Sunday 13th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జనసైనికుడికి అండగా పవన్ కళ్యాణ్..భారీ ఆర్థిక సాయం

జనసైనికుడికి అండగా పవన్ కళ్యాణ్..భారీ ఆర్థిక సాయం

Deputy Cm Pawan Kalyan Helps Janasainik | ఆంధ్రప్రదేశ్ లోని జనసేన పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణం కి చెందిన జనసైనికుడు దేవలం జగదీష్ గత 5 సం.|| గా రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల డయాలసిస్ చేసుకుంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.

చికిత్స కొరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ కష్టం గా ఉందని నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా ( Vinutha Kotaa )దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇదే విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వినుత తీసుకుని వెళ్లి జగదీష్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు.

వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి రూ.12 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారు. అనంతరం మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్కును వినుత కోటా మంగళవారం జనసైనికుడికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసైనికులకి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ తన సొంత కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినట్టు ఎప్పుడూ ఆదుకుంటారని పేర్కొన్నారు.

You may also like
హత్య కేసులో అరెస్టు..ఆమెను సస్పెండ్ చేసిన జనసేన
‘తెలుగు భాష అమ్మ..హిందీ మన పెద్దమ్మ’
‘మయన్మార్ సరిహద్దులో బందీలుగా ఉన్నవారిని కాపాడండి’
బ్యాటరీ సైకిల్ సిద్ధూకు పవన్ అభినందనలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions