Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > తాజా > సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు..ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చి మరీ !

సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు..ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చి మరీ !

Income Tax Raids At Sukumar’s House And Office | తెలుగు సినిమా ప్రముఖుల ఇళ్లల్లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

మంగళవారం ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ( FDC ) ఛైర్మన్ దిల్ రాజు ( Dil Raj ) నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో కూడా తనికీలీ మొదలుపెట్టారు. రెండవరోజు కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు బుధవారం దర్శకుడు సుకుమార్ ( Sukumar ) ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ( Airport ) నుండి సుకుమార్ ను ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

పుష్ప-2 సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్, ఆదాయ వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఐటీ సోదాలు జరుగుతున్న సంస్థల ద్వారా ఇటీవల బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ తెరకెక్కించిన పుష్ప-2 ( Pushpa-2 ) కలెక్షన్ల సునామీని సృష్టించిన విషయం తెల్సిందే. మరోవైపు సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vastunnam ) మూవీ కూడా భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ మూవీని దిల్ రాజు తెరకెక్కించారు.

You may also like
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’
‘అమెరికా పర్యటనలో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలనం’
‘సిద్ధి వినాయక ఆలయంలో ఎలాన్ మస్క్ తల్లి ప్రత్యేక పూజలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions