Friday 14th August 2026
12:07:03 PM
Home > తాజా > దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ ఇదే!

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ ఇదే!

Rajendra Nagar PS

Best Police Station In India | తెలంగాణ పోలీస్ వ్యవస్థకు మరో అరుదైన గౌరవం దక్కింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లో మొదటి స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో పోలీస్ స్టేషన్ ల పనితీరు ప్రామాణికంగా కేంద్ర హోంశాఖ నిర్వహించిన సర్వేలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.

కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న పోలీస్ స్టేషన్ గా రాజేంద్రనగర్ రికార్డ్ సృష్టించింది.

నమోదైన కేసుల వివరణ, హత్య కేసులో అతి త్వరగా నిందితుల గుర్తింపు, అనేక కేసులను ఛేదించడంలో అత్యంత ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకుగాను దేశంలోనే నెంబర్ -1 రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేశారు.

దేశంలో అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లో రాజేంద్రనగర్ కు మొదటి స్థానం లభించడంతో ఈనెల 5న జయపురలో జరిగే కార్యక్రమంలో ఇన్స్ పెక్టర్ నాగేంద్రబాబు అవార్డు తీసుకోనున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions