Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మణిపూర్ నుండి ముంబై వరకు రాహుల్ గాంధీ “భారత న్యాయ యాత్ర”!

మణిపూర్ నుండి ముంబై వరకు రాహుల్ గాంధీ “భారత న్యాయ యాత్ర”!

rahul gandhi

Rahul Gandhi Yatra | కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మరో భారీ యాత్ర చేయనున్నారు. “భారత న్యాయ యాత్ర” పేరిట దేశ తూర్పు భాగం లోని మణిపూర్ నుండి పశ్చిమ భారత్ లోని ముంబై వరకు సుమారు 6,200 కి.మీ. మేర ఈ యాత్ర సాగనున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

గతేడాది సెప్టెంబర్ 7 న భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు ఐదు నెలల పాటు పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. కాగా ఆ యాత్రకు వచ్చిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఈ సారి న్యాయ యాత్ర చేయనున్నారు.

Read Also: శబరిమల ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే!

జనవరి 14 నుండి మార్చి 20వ తేదీ వరకు 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో ఈ యాత్ర జరగనుంది. గతంలో లాగా పూర్తిగా పాదయాత్ర నే కాకుండా ఈ సారి బస్సు యాత్ర కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ యాత్రలో మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలతో రాహుల్ భేటీ అయ్యి ముచ్చటించనున్నట్లు తెలిపారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కాగా రాబోయే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.

You may also like
Rahul Gandhi on Women's Reservation Bill 2026
ఆ సినిమాను ఎవరూ చూడటం లేదు: రాహుల్ గాంధీ!
ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ దాడి..ప్రధానిపై రాహుల్ ఫైర్!
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions