Donald Trump reposts Michael Savage letter | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై తనకున్న వివక్షను బయటపెట్టుకున్నారు.
ప్రముఖ అమెరికన్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ భారత్, చైనా దేశాలను కించపరుస్తూ చేసిన ‘Savage Nation’ పాడ్‌కాస్ట్ ట్రాన్స్ క్రిప్ట్ ను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ఖాతాలో రీపోస్ట్ చేశారు.
ఆ ఆడియోలో భారతీయులను అత్యంత అవమానకరంగా సంబోధించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆసియా దేశాల నుంచి మహిళలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తారు.
ఇక్కడి చట్టాల వల్ల ఆ బిడ్డకు వెంటనే అమెరికా సిటిజన్‌షిప్ లభిస్తుంది. ఆ తర్వాత వారు తమ కుటుంబ సభ్యులందరినీ చైనా, భారత్ లేదా మరేదైనా నరకంనుంచి ఇక్కడికి తీసుకువస్తారు” అంటూ అత్యంత అనుచితంగా వ్యాఖ్యానించారు.
అమెరికా పౌరసత్వం లేనివారికి జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా సిటిజన్‌షిప్ రావడాన్ని మైఖేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ట్రంప్ ఈ లేఖను రీపోస్ట్ చేయడం ద్వారా పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలనే తన పాత నినాదానికి మళ్ళీ ప్రాణం పోశారు.
ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచి చూస్తున్న భారతీయులకు, ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలు మరియు చట్ట సవరణ ప్రతిపాదనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.






