Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > త్వరగా పిల్లల్ని కనండి.. కొత్త దంపతులకు సీఎం విజ్ఞప్తి!

త్వరగా పిల్లల్ని కనండి.. కొత్త దంపతులకు సీఎం విజ్ఞప్తి!

stalin

CM Stalin Urges Newlyweds Couple | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamilnadu CM) ఎం కే స్టాలిన్ (MK Stalin) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ వ్యాఖ్యల వెనక ఓ కారణం ఉంది. దేశంలో లోకసభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రం  లో లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మరోసారి స్పందించిన స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

“కొత్త దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేనే చెప్పాను. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న వేళ ఇప్పుడు అలా చెప్పలేను.  

ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి” అని సీఎం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions