PM Modi Takes Lion Safari | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ (Gujarat)కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్ ఆలయాన్ని (Somnath Temple) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడి నుంచి సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ లయన్ సఫారీకి వెళ్లారు. గుజరాత్ లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు.
స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి సిన్హ్ సదన్ నుంచి సఫారీకి బయల్దేరారు. స్వయంగా తానే కెమెరా చేత పట్టి సింహాలను ఫొటోలు తీశారు. అనంతరం జునాగఢలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లలో నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైప్ హెల్త్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.