Thursday 3rd September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఆంధ్రా రోడ్లపై మరోసారి కామెంట్లు చేసిన కేసీఆర్!

ఆంధ్రా రోడ్లపై మరోసారి కామెంట్లు చేసిన కేసీఆర్!

kcr news

KCR Satires On AP Roads | బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) మరోసారి ఆంధ్రప్రదేశ్ పై అభివృద్ధిపై (AP Roads) వ్యాఖ్యలు చేశారు.

కొద్దీ రోజుల క్రితం సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆరెస్ (BRS Meeting) ప్రజా ఆశీర్వాదా సభలో పాల్గొన్న గులాబీ బాస్ ఈ మేరకు మాట్లాడుతూ సింగల్ రోడ్లు వస్తే ఏపీ డబల్ రోడ్ వస్తే తెలంగాణ అని సంచలన కామెంట్స్ చేశారు.

Read Also: ‘ఆ పుట్టిల్లు నీకు ఎన్ని వేలకోట్ల కట్నం ఇచ్చింది’ రేవంత్ పై వైసీపీ ట్వీట్..!

మనం ఎవరితో విడిపోయామో అభివృద్దిలో వారికంటే మెరుగైన స్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు ఆయన. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏపీ రోడ్ల పై మాట్లాడిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్భంగా మరోమారు ఆంధ్ర ప్రస్తావన తీసుకొచ్చారు కేసీఆర్. సోమవారం నాడు అశ్వారావుపేట బీఆరెస్ సభలో పాల్గొన్న కేసీఆర్ గతంలో ఏపీ రోడ్ల పై తాను మాట్లాడితే కొందరు విమర్శించారని చెప్పారు.

కానీ ఇక్కడి ప్రజలు ఆంధ్ర సరిహద్దునే ఉంటారు ఒకసారి అక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగిన వృద్ధికి తేడా చూడాలని కోరారు. అలాగే ఆంధ్రా రోడ్లు మన రోడ్లు ఎలా ఉన్నాయో గమనించాలని ప్రజలను కోరారు కేసీఆర్.

You may also like
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
kcr revanth
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్!
tpcc chief mahesh goud
కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం అదే: టీపీసీసీ చీఫ్ మహేశ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions