Monday 15th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆమె మానసిక భ్రాంతిలో ఉన్నారు: విజయసాయిరెడ్డి!

ఆమె మానసిక భ్రాంతిలో ఉన్నారు: విజయసాయిరెడ్డి!

vijasai reddy Purandeswari

Vijayasai Reddy Tweet | ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeswari), వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పురందేశ్వరి పై మరోసారి సంచలన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

“పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్ట్యంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే.

పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే.” ” ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి…ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి…ఎన్టీఆర్ వ్యతిరేక కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి, కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి, బీజేపీలో పదవి పొంది, టీడీపీ అధ్యక్షుడైన మీ మరిది కోసం…అది కూడా, తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టిన మీ మరిది కోసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొమ్ముకాస్తున్నారంటే…ఇన్ని రంగులు మార్చగల మీ నైపుణ్యాన్ని ఏమని పిలవాలి?” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions