Monday 11th August 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కేసీఆర్ కు రూ.1.06 కోట్లు అప్పిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి!

కేసీఆర్ కు రూ.1.06 కోట్లు అప్పిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి!

kcr

KCR Affidavit | బీఆరెస్ అధినేత కేసీఆర్ కు (KCR) రూ.1.06 కోట్లు అప్పు ఇచ్చారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy).

కేసీఆర్ తో పాటు మాజీ ఎంపీ, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)కి కూడా రూ.కోటిన్నర అప్పు ఇచ్చినట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు వివేక్ వెంకటస్వామి.

Read Also: ఆంధ్రా రోడ్లపై మరోసారి కామెంట్లు చేసిన కేసీఆర్!

ఇటీవలే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ను దాఖలు చేశారు వివేక్. ఈ సందర్భంగా వివేక్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

వివేక్ వెంకటస్వామి ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ.606.67 కోట్లుగా ఉంది. అంటే తెలంగాణ లోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచారు.

చరాస్తులు రూ.380.76 కోట్లు, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు, దంపతులిద్దరి పేరిట ఉన్న అప్పు రూ.45.44 కోట్లు గా అఫిడవిట్ లో పేర్కొన్నారు వివేక్.

అలాగే సీఎం కేసీఆర్, వివేక్ వద్ద రూ. 1.06 అప్పు తీసుకున్నట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన వద్ద రూ.కోటిన్నర అప్పు తీసుకున్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు వివేక్.

You may also like
‘వివేక్ వెంకటస్వామి అనే నేను..’ మంత్రి గడ్డం వివేక్ ప్రస్థానమిదే!
kcr
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు లీగల్ నోటీసులు!
Babasaheb's death celebrants
ఘనంగా బాబాసాహెబ్‌ వర్ధంతి వేడుకులు
kcr
Big Breaking కేసీఆర్ ఓటమి.. కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions