Friday 18th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఘనంగా బాబాసాహెబ్‌ వర్ధంతి వేడుకులు

ఘనంగా బాబాసాహెబ్‌ వర్ధంతి వేడుకులు

Babasaheb's death celebrants

` -అతిధిగా ప్రముఖ అంబేడ్కరైట్‌ వివేక్‌ వెంకటస్వామి

హైదరాబాద్‌:ఫాదర్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఇండియా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 67వ వర్ధంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతరత్న డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించిన ప్రతీ ఒక్కరూ గౌరవ మర్యాదల తో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ నేపధ్యంలో మాసాబ్‌ ట్యాంక్‌ విజయనగర్‌ కాలనీ చౌరస్తాలో భీమ్‌ సైనిక్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ కలకోటి సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబాసాహెబ్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మీడియా హౌస్‌ అధినేత, నోటెడ్‌ అంబేడ్కరైట్‌ వివేక్‌ వెంకటస్వామి, గౌరవ అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక నియంత పాలన ముగిసిందని, అహంకారపూరిత కుటుంబ పాలనా శకానికి ప్రజలు గోరీ కట్టారని కొనియాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆరెస్‌ ప్రభుత్వం పై శ్వేతపత్రం విడుదల చెరయాలని కోరారు. కొత్తగా సిఎం పదవి చేపడతున్న రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమం ప్రతి యేటా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న భీమ్‌ సైనిక్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కలకోటి సత్యనారాయణను ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో సెట్విన్‌ మాజీ ఛైర్మన్‌ ఇనాయత్‌ అలీ బాక్రీ, మాజీ డైరెక్టర్‌ సిద్ధీక్‌, కట్టా నర్సింగరావు, వీరమణి తదితరులు పాల్గొన్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions