Saturday 4th July 2026
12:07:03 PM
Home > తాజా > నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

  • జీవో విడుదల చేసిన ప్రభుత్వం!

TS Police Jobs Notification | పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది.

హోంశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ.. ఏకంగా 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు పోస్టుల అనుమతిని ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ అధికారికంగా జీవో నెంబర్ 78 (G.O. 78) ను విడుదల చేసింది.

ఈ అనుమతితో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా త్వరలోనే అర్హతలు, వయోపరిమితి, సిలబస్ మరియు పరీక్షల పూర్తి షెడ్యూల్‌తో కూడిన అధికారిక నోటిఫికేషన్ (TS Police Jobs Notification) వెలువడనుంది.

Read Also: పాఠశాల సమీపంలో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం!

విభాగాల వారీగా పోస్టుల వివరాలు (Vacancy Break-up):

ప్రభుత్వం అనుమతించిన మొత్తం 5,000 పోస్టులలో అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 10 రకాల విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.

క్రమ సంఖ్యపోస్టు పేరు (Name of the Post)పోస్టుల సంఖ్య
1సివిల్ కానిస్టేబుల్ (Civil Constable)3,697
2ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ (AR Constable)1,052
3సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (Civil SI)148
4ఏఎస్సై ఫింగర్ ప్రింట్ బ్యూరో (ASI FPB)23
5పోలీస్ కానిస్టేబుల్ SAR CPL24
6పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ – PTO)20
7సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR SI)14
8రిజర్వ్ ఎస్సై TGSP (TGSP SI)12
9మెకానిక్ (PTO)7
10ఎస్సై SAR CPL (SI SAR CPL)3
మొత్తం ఖాళీలు (Total Vacancies)5,000

త్వరలోనే నోటిఫికేషన్.. ప్రిపరేషన్ వేగవంతం చేయండి..

ఆర్థిక శాఖ నుంచి అధికారిక అనుమతి లభించడంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు ప్రారంభించింది.

రాత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్షల (Physical Efficiency Tests) నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఐదు వేల భారీ ఖాళీలతో వస్తున్న ఈ నోటిఫికేషన్.. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే కల కంటున్న ఎంతోమంది అభ్యర్థులకు సువర్ణావకాశం కానుంది.

నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరియు శారీరక సాధనను ఇప్పుడే వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions