Saturday 8th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > లడ్డూ వివాదం..శాస్త్రాలతో పాటు అస్త్రాలను తీసుకెళ్లాలి

లడ్డూ వివాదం..శాస్త్రాలతో పాటు అస్త్రాలను తీసుకెళ్లాలి

Actor Ravi Kishan On Tirumala Laddu | తిరుమల శ్రీవారి లడ్డూలో జంతుకొవ్వును వినియోగించారన్న అంశం తీవ్ర వివాదంగా మారింది. ఈ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ ( Ravi Kishan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల లడ్డూలో జంతు మాంసాన్ని కలిపి ఇచ్చారని కన్నెర్ర చేశారు.

ఈ మేరకు మంగళవారం గోరఖ్‌పూర్‌ ( Gorakhpur )లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్థంతి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రస్తుత ఆలయాన్ని గతంలో నడిపిన వారు హిందువులు కాదని సంచలన ఆరోపణలు చేశారు.

శాస్త్రాలతో పాటు అస్త్రాలను, ఆయుధాలను తీసుకెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సాధువులు, యోధులుగా మరాల్సిన పరిస్థితి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions