Saturday 17th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటో పంపితే రూ.1000 FASTag రీఛార్జ్!

అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటో పంపితే రూ.1000 FASTag రీఛార్జ్!

  • NHAI ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’!

NHAI Clean Toilet Picture Challenge జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక వినూత్నమైన డిజిటల్ ఛాలెంజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ (Clean Toilet Picture Challenge) ను ప్రారంభించింది.

టోల్ ప్లాజాల వద్ద అపరిభ్రంగా, అశుభ్రంగా ఉన్న టాయిలెట్ల ఫోటోలను రిపోర్ట్ చేసిన ప్రయాణికులకు రూ.1,000 నగదు బహుమతి (FASTag రీఛార్జ్ రూపంలో) అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ (Special Campaign 5.0) లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..

జాతీయ రహదారులపై ప్రయాణించేవారు ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ (RajmargYatra) యాప్ నూతన వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేయబడిన (Geo-tagged) స్పష్టమైన ఫోటోలను అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుడు తన పేరు, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మొబైల్ నంబర్‌ను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

బహుమతి వివరాలు..

సరైన ఆధారాలతో అందిన మొదటి ఫిర్యాదుకు రూ. 1,000 విలువైన ఫాస్టాగ్‌ (FASTag) రీఛార్జ్ ను సదరు వాహన నంబర్‌కు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని క్యాష్‌గా విత్‌డ్రా చేసుకోవడానికి లేదా వేరొకరికి బదిలీ చేయడానికి వీలుండదు. ఈ సదుపాయం కేవలం NHAI పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద గల టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్ బంకులు, రోడ్ సైడ్ ధాబాల్లో ఉండే టాయిలెట్లకు ఇది వర్తించదు.

సేకరించిన ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మ్యాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎడిట్ చేసిన లేదా పాత ఫోటోలను తిరస్కరిస్తారు. ఒక రోజు ఒక టాయిలెట్‌పై వచ్చిన మొదటి చెల్లుబాటు అయ్యే ఫిర్యాదుకు మాత్రమే రివార్డు అందుతుంది.

You may also like
Rahul Gandhi on Women's Reservation Bill 2026
ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వివాదంలో దూరి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!
ఎన్నికల సంఘంపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదం!
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions