Friday 24th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఆత్మబలిదానాలు వద్దు.. సమ్మె విరమించండి’

‘ఆత్మబలిదానాలు వద్దు.. సమ్మె విరమించండి’

tg cabinet meeting

CM invites RTC unions for talks | ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది.

చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో శుక్రవారం చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందానికి చెప్పారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని సీఎం తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని, కార్మికుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీడియా సమావేశంలో మంత్రులు చెప్పారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అనాలోచిత చర్యలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. క్షణికావేశంలో ఆత్మబలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions