Sunday 3rd May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘శ్రీశైలం డ్యామ్ దిగువన గొయ్యి..తక్షణ చర్య అవసరం’

‘శ్రీశైలం డ్యామ్ దిగువన గొయ్యి..తక్షణ చర్య అవసరం’

Srisailam Project Plunge Pool | శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదాపు అంచున ఉంది, తక్షణ చర్య అవసరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( National Dam Safety Authority ) స్పష్టం చేసింది.

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి ఏర్పడింది. శ్రీశైలం డ్యామ్ పునాది 380 అడుగులు ఉండగా ఈ గొయ్యి మాత్రం దాదాపు 410 అడుగులు ఉన్నట్లు గతంలో నిర్వహించిన హైడ్రో గ్రాఫిక్ సర్వే ద్వారా వెల్లడైంది.

మే నెలాఖరు వరకు గొయ్యిని పూడ్చాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ నుండి నీరు విడుదలయ్యే ప్రాంతంలోనే ఈ గొయ్యి ఏర్పడింది. అయితే గతేడాదే గొయ్యిపై నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం పట్ల అథారిటీ సీరియస్ అయ్యింది. వర్షాకాలంలో ఇది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions