Friday 17th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రెండింగ్ లో #ReleaseSharmistha కారణం ఏంటంటే!

ట్రెండింగ్ లో #ReleaseSharmistha కారణం ఏంటంటే!

sharmishta

Release Sharmistha Trending | మహారాష్ట్రలోని పుణేకు చెందిన లా విద్యార్థి షర్మిష్ట ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు.

వివరాల్లోకి వెళితే భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ స్పందిస్తూ పుణేకు చెందిన షర్మిస్టా పనోలి (Sharmishta Panoli) మే 14న తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యల గురించి ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ షర్మిస్ట ఇస్లాం మతంపై, PBUHపై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.

ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడ్డారు. దీంతో #ArrestSharmishta అనే హ్యాష్ ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండ్ అయింది. ఆ వీడియో క్లిప్ వైరల్ కావడంతో కోల్ కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షర్మిస్టపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు. మే 31న పనోలిని కోల్కత్తా కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు చెప్పింది.

అయితే ఆమె అరెస్ట్ అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాజాగా సోషల్ మీడియలో #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

You may also like
ys jagan
మీ తండ్రి వారసత్వాన్ని తాకట్టు పెట్టకండి.. వైఎస్ జగన్ కు యూత్ కాంగ్రెస్ కౌంటర్!
cm revanth
కార్బన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
wife sells her husband
రియల్ లైఫ్ శుభలగ్నం.. భర్తను ప్రియురాలికి అమ్మేసిన భార్య!
supreme court
పిటిషన్ డ్రాఫ్టింగ్స్ లో ఏఐ వినియోగం.. సుప్రీంకోర్టు ఆందోళన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions