Tuesday 14th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఉప్పల్‌లో ప్రఫుల్ ‘పంచ్’.. యువ బౌలర్ అరుదైన రికార్డులు!

ఉప్పల్‌లో ప్రఫుల్ ‘పంచ్’.. యువ బౌలర్ అరుదైన రికార్డులు!

Praful Hinge

Praful Hinge IPL Debut Record | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) అంటేనే ఒకప్పుడు బౌలింగ్‌కు మారుపేరు.

ఆ వైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు కుర్రాళ్లు రాజస్థాన్ రాయల్స్ (RR) వెన్ను విరిచారు.

ముఖ్యంగా మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్ ప్రఫుల్ హింగే సృష్టించిన విధ్వంసానికి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది.

ఐపీఎల్ 19 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రఫుల్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ తొలి ఓవర్లోనే నిప్పులు చెరిగే బంతులతో రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ను కంపింపజేసిన ప్రఫుల్, ఏకంగా మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

అరంగేట్రం మ్యాచ్ తొలి ఓవర్లో 3 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డుకెక్కాడు. తన కోటాలో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

మరోవైపు సాకిబ్ హుస్సేన్ కూడా తన అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసి, భవిష్యత్తులో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగానికి తిరుగులేదని నిరూపించాడు.

సోషల్ మీడియా సెన్సేషన్: ప్రఫుల్ మైదానంలో వికెట్లు తీస్తుంటే, ఇటు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.

3000 నుంచి 3 లక్షలకు..
మ్యాచ్ ప్రారంభానికి ముందు కేవలం 3,000 మంది ఫాలోవర్లు ఉన్న ప్రఫుల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, మ్యాచ్ ముగిసే సమయానికి ఏకంగా 3 లక్షల మైలురాయిని చేరుకుంది.

గంటల వ్యవధిలోనే ఒక అనామక ప్లేయర్ గ్లోబల్ స్టార్‌గా మారిపోవడం ఐపీఎల్ మ్యాజిక్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కష్టపడి పైకొచ్చిన ఈ యువ ఆటగాళ్లకు దక్కిన గుర్తింపు పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్ రైజర్స్ యాజమాన్యం కూడా ఈ యువ రక్తానికి మరిన్ని అవకాశాలు ఇస్తే ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీని ఆపడం ఎవరి తరమూ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions