Tuesday 16th June 2026
12:07:03 PM
Home > Uncategorized > ‘ఒబామా.. మీ కారు మా అమ్మ ఇల్లంత ఉంది’: ప్రధాని మోదీ!

‘ఒబామా.. మీ కారు మా అమ్మ ఇల్లంత ఉంది’: ప్రధాని మోదీ!

obama modi

PM Modi USA Tour | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రస్తుతం అమెరికా (America) పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ (Jeo Biden) తో భేటీ అయ్యారు. అయితే మోదీ అమెరికా పర్యటన వేళ కొన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వైరల్ గా మారాయి.

2014లో ప్రధాని హోదాలో మోదీ తొలిసారి అమెరికా వెళ్లారు. అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒబామా వాడే లిమోసిస్ కారులో ఇద్దరూ కలిసి సుమారు 12 నిమిషాలు ప్రయాణించారు.

ప్రయాణ సమయంలో ఇద్దరి మధ్య కుటుంబ విషయాలు చర్చకు వచ్చాయి. మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని మోదీని ఒబామా అడిగారు. దింతో మోదీ చిరునవ్వుతో..’మీరు చెబితే నమ్మరేమో గాని మీ కారు సుమారు మా అమ్మ ఇల్లంత ఉంటుంది’ అని మోదీ జవాబిచ్చారట.

ఇది విన్న ఒబామా ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా ‘ మోదీ స్టోరీ ‘ అనే శీర్షికతో గుర్తుచేసుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions