Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్!

సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్!

Modi Revanth Reddy

PM Modi Phone Call To CM Revanth | తెలంగాణలో భారీ వర్షాలతో (Telangana Rains) పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.

ముఖ్యంగా ఖమ్మం (Khammam Floods), మహబూబాబాద్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.

పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను వివరించిన సీఎం వివరించారు. 

ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామన్న మోదీ భరోసా ఇచ్చారు.

You may also like
Rain Alert
తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక!
ktr pressmeet
హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
వరదల్లో మహిళా శాస్త్రవేత్త మృతి..కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions