Monday 17th March 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విచారణ చేసి జైలుకు పంపుతాం: అమిత్ షా!

విచారణ చేసి జైలుకు పంపుతాం: అమిత్ షా!

Amit Shah | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).

శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ (KCR) ప్రకటించిన ఏ హామీని అమలు చేయలేదని విమర్శించారు.

2014 లో దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్, మరి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ని సీఎం చేస్తామని స్పష్టం చేశారు.

అలాగే ముస్లింలకు ఇస్తామన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు.

పేపర్ లీకులకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని తెలిపారు. అలాగే కేసీఆర్ కు ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే మంత్రి పదవులు వస్తాయని ధ్వజమెత్తారు.

కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏమి చేయకపోగా వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు అమిత్ షా.

కేసీఆర్ అవినీతి పై బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా విచారణ జరుపుతుందని, అక్రమాలకు పాల్పడిన వారిని కచ్చితంగా జైలుకు పంపుతామన్నారు.

You may also like
‘రేవంత్ రెడ్డితో బీజేపీ నేతల సీక్రెట్ మీటింగ్’
‘అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్’
telangana governor
తెలంగాణ ప్రజల కలల సాకారానికే బడ్జెట్: గవర్నర్
భర్త వేధిస్తున్నాడని యువతి ఫోన్..సాయం చేస్తామన్న సీతక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions