Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > విడిపోయిన ఏఆర్ రెహమాన్ దంపతులు

విడిపోయిన ఏఆర్ రెహమాన్ దంపతులు

AR Rahman Divorce | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు ( Oscar Award ) విజేత ఏఆర్ రెహమాన్ ( AR Rahman ) దంపతులు విడిపోయారు. 29 ఏళ్ల వైవాహిక దాంపత్యానికి వీడ్కోలు పలికారు.

పరస్పర అంగీకారంతో రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ప్రకటించారు. 1995 లో ఈ జంటకు పెళ్లి అయింది. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలు ఉన్నారు.

ఇద్దరిమధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు దంపతుల మధ్య దూరాన్ని పెంచినట్లు దంపతుల తరఫు లాయర్ వందనా షా పోస్ట్ చేశారు.

దంపతుల మధ్య భావోద్వేగ ఒత్తిడి నెలకొన్నట్లు, ఈ నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు లాయర్ చెప్పారు. విడిపోవడానికి రెహమాన్, సైరా బాను అంగీకరించినట్లు పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions