Wednesday 12th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన సచిన్ కుంటుంబం.. ఎందుకో తెలుసా!

రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన సచిన్ కుంటుంబం.. ఎందుకో తెలుసా!

sachin family invites pm modi for arjun sania wedding

Sachin Family Meets PM Modi | భారత క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుటుంబం మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లను కలిశారు.

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ –  సానియా (Arjun Tendulkar – Sania Chandhok Wedding) వివాహం నేపథ్యంలో ఇరువురిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

గతేడాది ఆగస్టులో అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్‌ల నిశ్చితార్థం జరిగింది. మార్చి 5న వీరి విహాహం ఘనంగా జరగనుంది.

ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను వారి నివాసాలలో కలిసి వివాహ వేడుకకు ఆహ్వానించారు.

ఈ సందర్బంగా సచిన్ తన సోసల్ మీడియాలో ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు. తన కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నామని, యువ జంటకు ఇచ్చిన ఆశీస్సులు, సలహాలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసిన సందర్భంగా గత జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అమిత్ షా, రాహుల్ గాంధీలను కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

కాగా, సానియా చందోక్ గ్రావిస్ గ్రూప్ చైర్మన్ (Graviss Group)రవి ఘాయ్ మనవరాలు. ఆమె టెండూల్కర్ కుటుంబానికి సన్నిహితురాలు. ముఖ్యంగా సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు స్నేహితురాలు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions