– నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
PM Modi and Mallikarjun Kharge meeting | దేశ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నిరంతరం యుద్ధం నడుస్తున్నా, పార్లమెంట్ ప్రాంగణం మాత్రం మంగళవారం ఒక అరుదైన ఆత్మీయ కలయికకు సాక్ష్యంగా నిలిచింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరస్పరం పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పార్లమెంటు ఆవరణలోని ‘ప్రేరణ స్థల్’ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. అక్కడ అప్పటికే ఉన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజులను ఆయన పలకరించారు.
సరదా సంభాషణ..
అక్కడే ఉన్న ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వద్దకు వెళ్లిన ప్రధాని మోదీ, ఆయనతో కరచాలనం (Handshake) చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నవ్వుతూ కాసేపు సరదాగా సంభాషించుకున్నారు.
సభలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఈ అగ్రనేతలు, ఇలా ఆత్మీయంగా ముచ్చటించడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






