Sunday 4th October 2026
12:07:03 PM
Home > క్రైమ్ > నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు!

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు!

School Principal Roopa Reddy Murder | నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నెల 11న సాయంత్రం ఆమె స్కూల్ నుంచి ఇంటికి చేరుకునేలోపే, ఆమె ఇంటి గోడ దూకి లోపలికి చొరబడిన నిందితులు వంటగదిలో దాక్కున్నారు. ఆమె ఇంట్లోకి వచ్చి తలుపు తీసిన వెంటనే, ఫ్రెష్ అయ్యేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనుక నుంచి దాడికి తెగబడ్డారు.

27 సార్లు కత్తితో పొడిచి..

కత్తితో ఏకంగా 27 సార్లు పొడిచి రూపారెడ్డిని దారుణంగా హత్య చేశారు నిందితులు. ఆ తర్వాత ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా పక్కా ప్లాన్‌తో నేరానికి పాల్పడ్డారు.

దర్యాప్తులో వెలుగులోకి నిజాలు

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. హత్యకు పాల్పడింది మరెవరో కాదు, రూపారెడ్డి చదువు చెప్పిన పదో తరగతి విద్యార్థులేనని తేలడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

గంజాయికి బానిసలై, విచ్చలవిడిగా జల్సాలు చేసేందుకు డబ్బు కోసమే తమ ప్రిన్సిపాల్‌నే బలి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్‌లో సరదాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. టీచర్-విద్యార్థి బంధానికే మచ్చ తెచ్చిన ఈ దారుణ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లను కూడా వదలకుండా మాదక ద్రవ్యాలు ఎలా చుట్టుముడుతున్నాయో ఈ ఘటన మరోసారి తేటతెల్లం చేసింది.

You may also like
డబ్బుల రీల్స్ పోస్ట్ చేసినందుకు భారీ మూల్యం!
vc sajjanar
గణేష్ ఉత్సవాల్లో వల్గర్ రీల్స్, అశ్లీల పాటలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక!
PNB కరెన్సీ చెస్ట్‌లో రూ. 7.40 కోట్ల నకిలీ నోట్లు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions