Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి!

న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి!

sanket jayesh balsara

Sanket Jayesh Balsara | అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఓ ఉన్నత పదవి దక్కింది. న్యూయార్క్‌ లోని అమెరికా ఈస్టర్న్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్‌ జయేశ్‌ బల్సారా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ ఓ అధికారిక ప్రకటన చేసింది.

సంకేత్ బల్సారా 2017 నుంచి ఇదే కోర్టులో మేజిస్ట్రేటుగా పనిచేస్తున్నారు. కాగా, ఆ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆయనే. తాజాగా సంకేత్ బల్సారాకు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఆయన తండ్రి న్యూయార్క్‌ నగర పాలికలో ఇంజినీరుగా, తల్లి నర్సుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ భారత్‌, కెన్యాల నుంచి 50 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions