Wednesday 4th November 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోండి అంటే నా మీదే కేసు పెట్టారు

కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోండి అంటే నా మీదే కేసు పెట్టారు

Police Complaint On Ambati Rambabu | వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై పోలీసులు కేసు పెట్టారు. బుధవారం తన అనుచరులతో కలిసి గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు అంబటి రాంబాబు వెళ్లారు.

టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలి అంటూ తోటి నేతలతో కలిసి పోలీసు స్టేషన్ మెట్లపై నిరసనకు దిగారు.

చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం అంబటి రాంబాబు పైనే కేసును నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పోలీసులు అంబటి పై కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో అంబటి స్పందించారు. ‘ నా Complaints పై Action తీసుకోవాలని కోరితే మా మీదే కేసు పెట్టారు. ఎంత వరకు ధర్మం దీనిలో పోలీసు వారిని తప్పు పట్టను, మొత్తం నడిపిస్తుంది లోకేషే ‘ అని ఆరోపించారు.

You may also like
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions