Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బెంగళూరులో ఎగిరే టాక్సీలు..రెండుగంటల ప్రయాణం కేవలం 5 నిమిషాల్లోనే

బెంగళూరులో ఎగిరే టాక్సీలు..రెండుగంటల ప్రయాణం కేవలం 5 నిమిషాల్లోనే

Flying Taxis In Bengaluru | బెంగళూరులో త్వరలోనే ఎగిరే టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు ఎగిరే టాక్సీల సేవలందించేందుకు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్ సిద్ధమయ్యింది.

ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం లేకుండా ఎగిరే టాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు సార్లా ఏవియేషన్ తో బెంగళూరు ఎయిర్పోర్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

అయితే ఎగిరే టాక్సీలు అందుబాటులోకి వచ్చేందుకు మరో 2, 3 ఏళ్ల సమయం పట్టనుంది. ఎయిర్పోర్ట్, ఎలక్ట్రానిక్ సిటీ ఇలా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సేవలు ఉపయోగపడుతాయని సంస్థ తెలిపింది.

ప్రస్తుతం బెంగళూరులోని ఇందిరా నగర్ నుండి ఎయిర్పోర్ట్ కు వెళ్లాలంటే గంటా 50 నిమిషాల సమయం పడుతుంది, అదే ఎయిర్ టాక్సీలతో ఈ ప్రయాణానికి కేవలం 5 నిమిషాల సమయమే పట్టనుంది.

ఈ ఎగిరే టాక్సీలు హెలికాప్టర్ ల కంటే వేగంగా ప్రయాణిస్తాయి అంతేకాకుండా, వీటివల్ల వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions