Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత్ కు డబ్బులెందుకివ్వాలి..ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ కు డబ్బులెందుకివ్వాలి..ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Donald Trump News | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) భారతదేశాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెల్సిందే.

ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ( DOGE ) భారత్ కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లపై డోనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..భారత్ కు డబ్బులెందుకివ్వాలి, వల్ల దగ్గరే చాలా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా పై భారత్ అధిక పన్నులు వేస్తోందని మరోసారి కామెంట్స్ చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions