Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జైలులో ఉన్న ఖైదీలు..గంగా జలం పంపనున్న యూపీ సర్కార్

జైలులో ఉన్న ఖైదీలు..గంగా జలం పంపనున్న యూపీ సర్కార్

Maha Kumbh Water For Prisoners In UP | ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో మహా కుంభమేళా కన్నులపండువగా సాగుతుంది. దేశ విదేశాల నుండి వస్తున్న భక్తులతో ప్రాంతం కిక్కిరిపోయింది.

ఇప్పటికే 55 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. ఇదిలా ఉండగా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న జైళ్లలో ఉన్న ఖైదీల కోసం యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని 90 వేల మంది ఖైదీలు గంగా జలంతో స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్ర జలాన్ని సేకరించి రాష్ట్రంలోని జైళ్లకు తరలించనున్నారు.

గంగా జలాన్ని జైళ్లలో ఉండే నీటిలో కలుపుతారు. పవిత్ర స్నానాల అనంతరం పూజలు చేసుకునేందుకు ఖైదీలకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహన్ వెల్లడించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions