Monday 17th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘భారత రైతుగా డోనాల్డ్ ట్రంప్..వైరల్ గా మారిన ఏఐ వీడియో’

‘భారత రైతుగా డోనాల్డ్ ట్రంప్..వైరల్ గా మారిన ఏఐ వీడియో’

Donald Trump News | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రైతుగా మారితే అచ్చం ఇలానే ఉంటాడేమో అనే విధంగా ఉన్న ఒక వీడియో నెట్టింట్లో తాజగా వైరల్ గా మారింది.

జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్నే పరేషాన్ చేస్తున్నారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన ట్రంప్ సూట్ ధరించి ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. కానీ కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ట్రంప్ ను భారతదేశంలోని ఓ రైతుగా మార్చారు.

ఈ వీడియో నెటీజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో పల్లెటూరులో సైకిల్ పై గడ్డిమోపు తీసుకెళ్తున్నట్లు ట్రంప్ కనువిందు చేశారు. అలాగే ఆవులను తోలుకెళ్తూ, చెట్టెక్కి పూలను కొస్తూ, పిల్లలకు బహుమతులు ఇస్తున్న ఓ తాతగా ట్రంప్ ను రూపొందించారు. ఆ అందమైన వీడియోకు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’ మూవీ పాటను జోడించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions