Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘అమ్మ కోరిక..60వ ఏట పెళ్లి చేసుకున్న బీజేపీ మాజీ ఎంపీ’

‘అమ్మ కోరిక..60వ ఏట పెళ్లి చేసుకున్న బీజేపీ మాజీ ఎంపీ’

Dilip Ghosh Marriage News | ఐపీఎల్ లో భాగంగా కోల్కత్త ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచును వీక్షిస్తున్న సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు వెస్ట్ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్ గోష్.

ఈ క్రమంలో 60 ఏళ్ల బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పార్టీకి చెందిన మహిళా నాయకురాలు అయిన 51 ఏళ్ల రింకూ మజూమ్దార్ ను శుక్రవారం అత్యంత సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకున్నారు.

భర్తకు విడాకులు ఇచ్చిన రింకూకు ఇది రెండవ వివాహం. కాగా అమ్మ చివరి కోరిక మేరకు తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు దిలీప్ గోష్.

గత నాలుగేళ్లుగా మజూమ్దార్ తో దిలీప్ కు పరిచయం ఉన్నా ఇటీవలే వివాహం చేసుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ బీజేపీ నాయకులు దిలీప్ గోష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions