Cricket Australia Extends Holi Wishes With 2023 World Cup | ప్రపంచ వ్యాప్తంగా హొలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా మెల్బోర్న్ ( Melbourne ) లో నిర్వహించిన హొలీ వేడుకల్లో వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించారు.
దింతో టీం ఇండియా అభిమానులు 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. 2023లో భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ( ICC World Cup-2023 ) లో ఆది నుండి టీం ఇండియా ఓటమనేదే లేకుండా ఫైనల్స్ కు చేరింది.
ఈ క్రమంలో భారత్ 12 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ ను ముద్దాడడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. కానీ అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ఆరవ సారి ట్రోఫీని ముద్దాడింది. ఆ రోజు భారత అభిమానులకు ఓ పీడకల లాగా మిగిలిపోయింది.
తాజగా మెల్బోర్న్ వేదికగా జరిగిన హొలీ సంబరాల్లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ ను ప్రదర్శించింది. అక్కడికి వచ్చిన అభిమానులు ట్రోఫీతో ఫోటోలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.