PAT CUMMINS IS THE ONLY OVERSEAS CAPTAIN IN IPL 2025 | ప్రపంచంలోనే క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ( IPL ) మరో ఎనమిది రోజుల్లో ప్రారంభం కానుంది.
అయితే ఐపీఎల్ -2025 సీజన్ లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. లీగ్ లో మొత్తం 10 టీంలు పోటీ పడుతున్నాయి. అయితే తొమ్మిది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లు గా ఉంటే ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sun Risers Hyderabad ) టీంకు మాత్రమే ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) రూపంలో విదేశీ ఆటగాడు సారథిగా ఉన్నారు.
ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో జట్లు తమ కెప్టెన్లను ప్రకటించాయి. తొమ్మిది జట్లు తమ కెప్టెన్లను చాలా రోజుల ముందే ఖరారు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే తాజగా ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ( Axar Patel ) ఢిల్లీకి సారథ్యం వహించనున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ మినహా మిగిలిన జట్లకు టీం ఇండియా ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు. 2024 లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డూప్లిసిస్ మరియు కొన్ని మ్యాచులకు సామ్ కరన్ ( Sam Curran ) పంజాబ్ కు సారథ్యం వహించాడు.
కానీ 2025 లో మాత్రం కేవలం హైదరాబాద్ జట్టుకు మాత్రమే ప్యాట్ కమిన్స్ రూపంలో విదేశీ ఆటగాడు సారథ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ గత సీజన్ లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోనే జట్టు అద్భుతంగా ఆడిందని, ఈ సారి కూడా కమిన్స్ సారథ్యంలో జట్టు చెలరేగి పోవడం గ్యారంటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.