Friday 8th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘విజయ్’కి లైన్ క్లియర్.. ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐ, సీపీఎం, వీసీకే జై!

‘విజయ్’కి లైన్ క్లియర్.. ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐ, సీపీఎం, వీసీకే జై!

vijay

TVK Gets Magic Figure | తమిళనాడులో గత కొద్దిరోజులుగా నెలకొన్న పొలిటికల్ సస్పెన్స్‌కు శుభం కార్డు పడబోతోంది. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన సంఖ్యాబలం ఎట్టకేలకు లభించింది.

గవర్నర్ కోరిన విధంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్ కూడగట్టగలిగారు. టీవీకేకు స్వంతంగా 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

తాజాగా సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరు, వీసీకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించడంతో మొత్తం మద్దతుదారులు 118కి చేరారు.

దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించింది. ఈ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా చిన్న పార్టీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం.

లెఫ్ట్ పార్టీలకు రెండు, వీసీకేకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.  మద్దతు పత్రాలతో విజయ్ నేడు సాయంత్రం 6 గంటలకు మూడవసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నారు.

మద్దతుదారుల సంతకాలతో కూడిన జాబితాను ఆయనకు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

డీఎంకే కూటమికి భారీ షాక్…

దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి నడిచిన లెఫ్ట్ పార్టీలు మరియు వీసీకే.. ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపడం తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిణామంతో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. మెజారిటీ మార్క్ అందుకున్న నేపథ్యంలో, శని లేదా ఆదివారాల్లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions